16

అన్నమయ్య కీర్తన రామా దశరథ రామా - శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలు


రామ దశరథరామ నిజ సత్య-
కామ నమో నమో కాకుత్థ్సరామ ॥

కరుణానిధి రామ కౌసల్యానందన రామ
పరమ పురుష సీతాపతిరామ ।
శరధి బంధన రామ సవన రక్షక రామ
గురుతర రవివంశ కోదండ రామ ॥

దనుజహరణ రామ దశరథసుత రామ
వినుతామర స్తోత్ర విజయరామ ।
మనుజావతారా రామ మహనీయ గుణరామ
అనిలజప్రియ రామ అయోధ్యరామ ॥

సులలితయశ రామ సుగ్రీవ వరద రామ
కలుష రావణ భయంకర రామ ।
విలసిత రఘురామ వేదగోచర రామ
కలిత ప్రతాప శ్రీవేంకటగిరి రామ ॥

Aaj ki Tithi