advertisment: 1
16

పరమాత్ముడు వెలిగే - శ్రీ రామ కీర్తనలు

రాగం: వాగధీశ్వరీ
తాళం: ఆది

పల్లవి
పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగ తెలుసుకోరే

అనుపల్లవి
హరియట హరుడట సురులట నరులట
అఖిలాండ కోటులటయందరిలో (పరమ)

చరనం
గగనాఅనిల తేజో-జల భూ-మయమగు
మృగ ఖగ నగ తరు కోటులలో
5సగుణములో 6విగుణములో సతతము
సాధు త్యాగరాజాదియాశ్రితులలో (పరమ)

Aaj ki Tithi