16

జయ జయ జయ ప్రియ భారత - భారత మాత

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి

జయ జయ సశ్యమల సుశ్యామ చలచ్చేలాంచల
జయ వసంత కుసుమ లతా చలిత లలిత చూర్ణకుంతల
జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పద యుగళా!

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి ...

జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ
జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ
జయ మదీయ మధురగేయ చుంబిత సుందర చరణా!

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి

Aaj ki Tithi