advertisment: 1
16

అన్నమయ్య కీర్తన సువ్వి సువ్వి సువ్వాలమ్మ - శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలు


సువ్వి సువ్వి సువ్వాలమ్మా
నవ్వుచు దేవకి నందను గనియె ॥

శశి వొడచె అలసంబులు గదచె
దిశ దేవతల దిగుళ్ళు విడచె ॥

కావిరి విరసె కంసుడు గినిసె
వావిరి పువ్వుల వానలు గురిసె ॥

గతి సేసె అటు గాడిద గూసె
కుతిలకుడిచి జనకుడు నోరు మూసె ॥

గగురు పొడిచె లోకము విధి విడిచె
మొగులు గురియగ యమునపై నదచె ॥

కలిజారె వేంకటపతి మీరె
అలమేల్మంగ నాంచారమ్మకలుకలు తీరె ॥

Aaj ki Tithi