advertisment: 1
16

అన్నమయ్య కీర్తన పెరిగినాడు చూడరోఇ - శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలు


పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు ।
పరగి నానా విద్యల బలవంతుడు ॥

రక్కసుల పాలికి రణరంగ శూరుడు
వెక్కసపు ఏకాంగ వీరుడు ।
దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు
అక్కజమైనట్టి ఆకారుడు ॥

లలిమీరిన యట్టి లావుల భీముడు
బలు కపికుల సార్వభౌముడు ।
నెలకొన్న లంకా నిర్థూమధాముడు
తలపున శ్రీరాము నాత్మారాముడు ॥

దేవకార్యముల దిక్కువరేణ్యుడు
భావింపగల తపః ఫల పుణ్యుడు ।
శ్రీవేంకటేశ్వర సేవాగ్రగణ్యుడు
సావధానుడు సర్వశరణ్యుడు ॥

Aaj ki Tithi