16

లన్నమయ్య కీర్తన లాలి శ్రీ కృష్నయ్య - శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలు


లాలి శ్రీ క్రిష్ణయ్య నీల మేఘవర్ణ
నవ నీల మేఘవర్ణ
బాలగోపాలపాల పవ్వళింపరా

సింగారించిన మంచి బంగారు ఊయలలోన
మరి బంగారు ఊయలలోన
శంఖు చక్రథరస్వామి నిదురపోరా

లలితాంగి రుక్మిణీ లలనాయె కావలెనా
నీకు లలనాయె కావలెనా
పలుకు కోయిల సత్యభామయె కావలెనా

అందెలూ మువ్వలూ సందడిగ మ్రోయగను
అతి సందడిగ మ్రోయగను
అందముగాను నీవు పవ్వలింపరా

పగడాల పతకాలు కంఠనా ధరియించి
నీ కంఠనా ధరియించి
వంగేవు తొంగేవు నిదురపోరా

అలుకలు పోనెల అలవేలు మంగతో
శ్రీ అలవేలు మంగతో
కులుకుచు శయ్యనించు వెంకటేశ్వరుడా

Aaj ki Tithi